Kadiri: గురువు కాళ్లకు మొక్కి ఆశీర్వచనం తీసుకున్న ఎమ్మెల్యే కందికుంట!
Kadiri: కదిరి 37వ వార్డు ప్రచారంలో భావోద్వేగం. తనకు పాఠాలు చెప్పిన గురువు కనబడటంతో హోదాను పక్కనపెట్టి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే కందికుంట.
Kadiri: గురువు కాళ్లకు మొక్కి ఆశీర్వచనం తీసుకున్న ఎమ్మెల్యే కందికుంట!
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కదిరి 37వ వార్డులో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రచారంలో భాగంగా ఇంటిటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్న క్రమంలో తనకు విద్యను భోధించిన గురువు కనబడగానే ఎమ్మెల్యే కందికుంట భావోద్వేగానికి గురైయ్యారు.
తన స్థాయిని పక్కనపెట్టి ఒక్కసారిగా గురువు కాళ్ళను మొక్కారు. తన గురువుతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గురువుల పట్ల తనకున్న గౌరవాన్ని ప్రదర్శించారు.




