Kadiri: కదిరిలో ఉత్సాహంగా కూటమి ప్రచారం ఇంటింటా తిరిగిన ఎమ్మెల్యే కందికుంట

Kadiri: కదిరి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. 32, 31, 30వ వార్డుల్లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 29 Oct 2026 10:13 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో ఉత్సాహంగా కూటమి ప్రచారం ఇంటింటా తిరిగిన ఎమ్మెల్యే కందికుంట

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా 32, 31, 30వ వార్డుల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు నాయకులకు ఆత్మీయ స్వాగతం పలకగా, వార్డుల్లో జై టీడీపీ.. జై కూటమి నినాదాలు మార్మోగాయి.

ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కదిరి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పట్టణంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచి, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీమతి షేక్ అర్షియా భాను గారితో పాటు 32వ వార్డు అభ్యర్థి శ్రీమతి కటిక షబ్రీన్, 31వ వార్డు అభ్యర్థి శ్రీమతి కొలిమి సుమియా, 30వ వార్డు అభ్యర్థి సమీర్ కూటమి అభ్యర్థుల సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.

కదిరి పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు అందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI