Kadiri: ఎన్‌పీ కుంటలో కూటమి అభ్యర్థుల తరఫున భైరవప్రసాద్ ఎన్నికల ప్రచారం

Kadiri: నంబుల పూలకుంటలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జనసేన కదిరి ఇన్‌చార్జ్ భైరవప్రసాద్ ప్రచారం. సైకిల్, గాజు గ్లాస్, కమలం గుర్తులకే ఓటెయ్యాలని పిలుపు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 2 Nov 2026 5:17 PM IST
Kadiri
X

Kadiri: ఎన్‌పీ కుంటలో కూటమి అభ్యర్థుల తరఫున భైరవప్రసాద్ ఎన్నికల ప్రచారం

కదిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా N.P. కుంట మండల అభ్యర్థులుగా ZPTC కాశెట్టి శివమ్మ , MPTC నల్లబెల్లి అశోక్ ను గెలిపించుకోవాలని కోరుతూ కదిరి నియోజవర్గం జనసేన ఇంచార్జీ భైరవ ప్రసాద్ నంబుల పూలకుంటలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రజలు కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా చెప్పాం చేస్తున్నాం అనే విధంగా విశ్వాసం నుంచి వికాసం వైపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ సహకారం ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడి గారి అపార అనుభవం,

ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముందు ఆలోచన వల్లే ఇది సాధ్యం అవుతోందని ఇది మంచి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అందుకే ప్రజలు కూడా ఆలోచన చేసి NDA కూటమి అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై , గాజు గ్లాస్ గుర్తుపై , సైకిల్ గుర్తుపై వేసి వేయించి గెలిపించాలని అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.వీరితో పాటుగా NDA కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI