Kadiri: కదిరి స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ప్రచారం జోరు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి రామ శ్రీ లక్ష్మీ తరఫున ఆమె భర్త, కాంగ్రెస్ నేత మోహన్ గాంధీ ముమ్మరంగా ప్రచారం చేశారు.
Kadiri: కదిరి స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ప్రచారం జోరు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థిగా శ్రీమతి మఠం రామ శ్రీ లక్ష్మీ ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలమత్తూరు మోహన్ గాంధీ సతీమణి మఠం రామ శ్రీ లక్ష్మీ మొదట కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయ సమీకరణలు నేపథ్యంలో పార్టీ అధిష్టానం ముస్లిం అభ్యర్థికి చోటు కల్పించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు.
ఈ సందర్భంగా కదిరి మున్సిపాలిటీలోని పలు వార్డులలో నేడు విస్తృత ప్రచారం కొనసాగించారు. కదిరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు అందమైన నగరంగా తీర్చిదిద్దడం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని, పట్టణ అభివృద్ధి కోసం తమకు అవకాశం కల్పించాలని స్వతంత్ర అభ్యర్థి భర్త మోహన్ గాంధీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు




