Kadiri: పదవుల కంటే పార్టీయే ముఖ్యం: డైమండ్ ఇర్ఫాన్
Kadiri: కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి మార్పుపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ స్పందించారు. పదవుల కంటే పార్టీ విశ్వాసమే ముఖ్యమని స్పష్టం చేశారు.
Kadiri: పదవుల కంటే పార్టీయే ముఖ్యం: డైమండ్ ఇర్ఫాన్
శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన సతీమణి షేక్ సమీరా పేరును చైర్ పర్సన్ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో నామినేషన్ మొదటి రోజు అట్టహాసంగా షేక్ సమీరా ఆమె భర్త డైమండ్ ఇర్ఫాన్ నామినేషన్ దాఖలు చేశారు. మరుసటి రోజే అధిష్టానం నుంచి అభ్యర్థి మార్పు నిర్ణయం రాగానే పార్టీ ఆదేశాలు తనకు శిరోధార్యంగా భావించి వెంటనే అంగీకరించానని అన్నారు.
పదవుల కంటే పార్టీపై నమ్మకం విశ్వాసమే ముఖ్యం అన్నారు. అభ్యర్థి మార్పుపై తనకు ఎలాంటి అపోహలు లేవని తన చివరి శ్వాస కోసం తాను నమ్ముకున్న తమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అడుగుజాడల్లో నడుస్తానని స్పష్టం చేశారు.




