Anantapur: గుత్తి ప్రజలకు మరింత చేరువైన సత్వర న్యాయ సేవలు!

Anantapur: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 1వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి భానుమతి ఆదివారం ఘనంగా ప్రారంభించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 27 Sept 2026 2:36 PM IST
Anantapur
X

Anantapur: గుత్తి ప్రజలకు మరింత చేరువైన సత్వర న్యాయ సేవలు!

Anantapur: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 1వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి భానుమతి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమం ప్రారంభానికి ముందు హైకోర్టు న్యాయమూర్తి భానుమతికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు సురేష్ రెడ్డి, చల్లా గుణరంజన్, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన 1వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు అందుబాటులోకి రావడంతో గుత్తి ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయి. స్థానికంగా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ వేగవంతం కావడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో ఈ కోర్టు కీలక పాత్ర పోషించనుందని న్యాయవర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి భానుమతిని గుత్తి బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL