Kalyanadurgam: పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీలో జనసేన యువ నేత గంగరాజుకు చోటు
Kalyanadurgam: జనసేన పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీలో చోటు లభించడంపై కళ్యాణదుర్గం యువ నేత గంగరాజు హర్షం. పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Kalyanadurgam: పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీలో జనసేన యువ నేత గంగరాజుకు చోటు
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతానికి చెందిన జనసేన యువ నాయకుడు గంగరాజుకు జిల్లా పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీలో సభ్యుడిగా అవకాశం లభించింది. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని గంగరాజు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజాసేవలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. జనసేన పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తన శక్తిమేర పనిచేస్తానని స్పష్టం చేశారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ కూటమి బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
తనకు ఈ పదవిని కేటాయించి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా పనిచేసి పదవికి న్యాయం చేస్తానని గంగరాజు పేర్కొన్నారు.




