Satya Sai: స్వగ్రామం వేపలపల్లిలో సాహి సురేష్‌కు అపూర్వ స్వాగతం!
Satya Sai: రవితేజ 'ఇరుముడి' సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్‌ను శ్రీ సత్యసాయి జిల్లా స్వగ్రామంలో గ్రామస్థుల ఘన సత్కారం.
Satya Sai: స్వగ్రామం వేపలపల్లిలో సాహి సురేష్‌కు అపూర్వ స్వాగతం!
Satya Sai: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఇరుముడి సినిమా సెట్స్ విషయంలో కీలకపాత్ర పోషించిన సాహి సురేష్ తన స్వగ్రామం సత్యసాయి జిల్లాలోని తనకల్లు మండలం వేపలపల్లి గ్రామానికి చేరుకున్న సందర్భంగా స్థానికులు కదిరి ప్రాంత యువకులు ఆయనను కలిసి ఘనంగా సత్కరించారు.
ఇరుముడి సినిమా తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రేక్షాదరణ పొంది రవితేజ కెరీర్లోనే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అద్భుతమైన విజయం సాధించడంలో ప్రేక్షకుల ఆదరణ మరచిపోలేనిదని,
ఇటువంటి గొప్ప సినిమాకు తాను ప్రొడక్షన్ డిజైనర్ గా పని చెయ్యడం చాలా సంతోషంగా భావిస్తున్నానని అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మైత్రి మూవీస్ సంస్థ , డైరెక్టర్ శివ నిర్వాణ గారికి , మాస్ మహారాజ రవితేజ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేకల సాయి , కార్తీక్ , లక్ష్మణ కుటాల , రాజేంద్ర ప్రసాద్ , బాలకృష్ణ , బొక్కసం నవీన్,వరుణ్ తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు.




