Hindupur: హిందూపురంలో విచిత్ర ఘటన - అరగంట పాటు వెయ్యి కోట్లకు అధిపతి!

Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో విచిత్ర ఘటన. వ్యాపారి ఆనంద్ అకౌంట్‌లో అరగంట పాటు వెయ్యి కోట్ల జమ. ఆ వెంటనే జీరో బ్యాలెన్స్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు.

RAMANJANEYULU, HINDUPUR
Published on: 6 Nov 2026 10:46 AM IST
Hindupur
X

Hindupur: హిందూపురంలో విచిత్ర ఘటన - అరగంట పాటు వెయ్యి కోట్లకు అధిపతి!

Hindupur: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో సదాశివ నగర్ కు చెందిన ఓ వ్యాపారి ఆనంద్ ఖాతాలో 1000 కోట్ల రూపాయలు అకౌంట్ లో జమాయి అరగంటలోనే జీరో బ్యాలెన్స్ కలలోనో, సినిమా లోనో కాదు నిత్య జీవితంలోనే అరగంట పాటు వెయ్యికోట్లకు అధిపతి అయ్యాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే జీరో అయ్యా డు.

ఈషాకింగ్ ఘటన హిం దూపురంలో జరిగింది. పట్ట ణంలోని సదాశివనగర్ చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి తోట ఆనంద్ కొటాక్ మహేంద్రబ్యాంక్ లో 1147924495 నంబర్ ఖాతా ఉంది. అయితే మంగళవారం మధ్యాహ్నం ఆయన ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. తెరిచి చూడగా తన ఖాతాలో డబ్బులు జమ అయినట్లు గుర్తించా డు. తన ఖాతాలో మొదట రూ.32వేలు పైచిలుకు ఉంది. ఆ తరువాత చూసేసరికి వెయ్యికోట్లు జమ అయినట్లు గుర్తించాడు. దీన్ని స్నేహి తులకు సైతం చూపించాడు.

ఈ షాక్ నుంచి తేరుకునేలోపే అరగంట లోనే తన ఖాతాలో జీరో చూపించింది. అంతేకాక మొదట తన ఖాతాలో ఉన్న రూ.32వేలకుపైగా నగదుకూడా కనిపించకుండా పోయింది. దీంతో బ్యాంక్ వద్దకు వెళ్లి ఆరాతీశాడు. వారుకూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో వెంటనే వన్డేన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైంలో కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆనంద్ తెలిపారు. ఈ విషయం బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.

RAMANJANEYULU, HINDUPUR

RAMANJANEYULU, HINDUPUR