Hindupur: హిందూపురంలో ఘనంగా టిప్పుసుల్తాన్ జయంతోత్సవాలు.. ఐక్యత
Hindupur: హిందూపురం ఏఎంఎస్ ఫంక్షన్ హాల్లో టిప్పుసుల్తాన్ జయంతోత్సవాలు; మన్సూర్ అలీ టిప్పుకు జాతీయ పురస్కారం, విద్యార్థులకు బహుమతుల ప్రదానం.
Hindupur: హిందూపురంలో ఘనంగా టిప్పుసుల్తాన్ జయంతోత్సవాలు.. ఐక్యత
హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణం లోని ఏఎంఎస్ ఫంక్షన్ హాల్ లో హిందూముస్లింలు ఐక్యంగా మహావీరుడు షహీద్ టిప్పుసుల్తాన్ జయంతోత్స వాలు ఘనంగా జరుపుకున్నారు అఖిల భారత షహీద్ టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కల్లూరు ఉమర్ ఫరూఖ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహావీరుడు షహీద్ టిప్పుసుల్తాన్ జయంతోత్సవాల సందర్భంగా షహీద్ టిప్పుసుల్తాన్ జాతీయ పురస్కారం 2026 ను ముఖ్య అతిథిగా విచ్చేసిన సాహెబ్జాదా సయ్యద్ మన్సూర్ అలీ టిప్పు తెహ్రిక్-ఎ-ఖుదాదాద్ జాతీయ అధ్యక్షుడు.
మైసూరు షహీద్ టిప్పు సుల్తాన్ యొక్క ఏడవ తరం వారసుడికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మహా ఆచార్య శ్రీ రవిశంకర్ గురూజీ
ఎగ్జిక్యూటివ్ సభ్యులు, Governance from Below సంస్థ, USA
2017 నుండి ప్రత్యేక సలహాదారు స్థాయి, ECOSOC, ఐక్యరాజ్య సమితి విభాగం వారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ జేవీ అనిల్ కుమార్ డీఈ రమేష్ కుమార్ చేనేత కార్మిక నాయకులు ఏసీ నాగరాజు క్రైస్తవ సంఘం పెద్దలు నాగేంద్ర కుమార్ సిక్కు సంఘం పెద్దలు పల్వేందర్ సింగ్ ఆర్యవైశ్య సంఘం నాయకులు జేపీకే రాము గిరిజన సంఘం నాయకులు సున్నీ జమాత్ మౌలానా షాబుదీన్ అహలే హదీస్ మౌలానా ఇస్మాయిల్ మౌలానా ఇర్ఫాన్ తదితరులు పురస్కారం అందజేశారు.
అనంతరం అందరూ హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి మహావీరుడు షహీద్ టిప్పుసుల్తాన్ ఆశయాలు వర్ధిల్లాలి జోహార్ షహీద్ టిప్పుసుల్తాన్ అని చేతులెత్తి ఐకమత్యం ప్రదర్శించారు అనంతరం రవిశంకర్ గురూజీ టిప్పుసుల్తాన్ వారసులు మన్సూర్ అలీ టిప్పు పెద్దలు మాట్లాడుతూమహావీరుడు షహీద్ టిప్పుసుల్తాన్ హిందూ ముస్లిం ఐక్యత కోసం మాతృ భూమి బానిస సంకెళ్ళు తెంచడానికి రాజీ లేని పోరాటం చేశాడని శృంగేరి శారదా మాత పీఠాన్ని రక్షించి పునః ప్రతిష్ఠ చేయించాడని వందలాది దేవాలయాలకు సహాయ సహకారాలు అందించి వేలాది ఎకరాల భూములు దేవాలయాలకు
అందజేశారని మత సామరస్యం పరమత సహనం సోదర భావం వసుధైక కుటుంబ నిర్మాణం కోసం టిప్పుసుల్తాన్ షహీద్అసువులు బాసాడని అన్నారు మనమంతా భారత దేశ అభివృద్ధి జాతీయ సమైక్యత దేశ సుస్థిరత కోసం నిరంతరం ఆచరణాత్మక అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు కార్యక్రమం అనంతరం 300మంది టిప్పుసుల్తాన్ వేషధారణ 200మంది వ్యాసరచన ప్రసంగాలు చిత్రలేఖనం దేశ సంస్కృతి చరిత్ర రక్షణ కోసం పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు పురస్కారాలు ప్రశంసా పత్రాలు అందజేశారు.




