Hindupur: హిందూపురంలో వైసీపీకి షాక్: టీడీపీలోకి 150 కుటుంబాలు!

Hindupur: హిందూపురం రహమత్‌పురంలో 150 మైనార్టీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. చైర్మన్ అభ్యర్థి పురిడి మంజునాథ్, డాక్టర్ సురేంద్ర వారికి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు.

RAMANJANEYULU, HINDUPUR
Published on: 22 Oct 2026 9:12 PM IST
Hindupur
X

Hindupur: హిందూపురంలో వైసీపీకి షాక్: టీడీపీలోకి 150 కుటుంబాలు!

హిందూపురం: హిందూపురం పట్టణంలోని రహమత్‌పురం ప్రాంతంలో రాజకీయ సందడి నెలకొంది. అస్లం, ఆయా వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థుల ఆధ్వర్యంలో సుమారు 150 మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పురిడి మంజునాథ్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్‌ సురేంద్ర, పార్టీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అనిల్‌కుమార్‌ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.

పార్టీలో చేరిన వారికి నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డుల్లో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకుంటున్న తరుణంలో రహమత్‌పురంలో చోటుచేసుకున్న ఈ చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్థానిక నాయకుల సమన్వయంతో మైనార్టీ కుటుంబాలు పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల వేళ వార్డుల వారీగా మద్దతు కూడగట్టేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్‌, అమర్‌, ఆయా వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థులు, మైనార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RAMANJANEYULU, HINDUPUR

RAMANJANEYULU, HINDUPUR