Hindupur: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సబితా రెడ్డికి మద్దతుగా బలరామిరెడ్డి ప్రచారం!

Hindupur: హిందూపురం 31వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సబితా రెడ్డి గెలుపే లక్ష్యంగా మాజీ చైర్మన్ బలరామిరెడ్డి ప్రచారం. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి.

C RAMANJINEYULU, HINDUPUR
Updated on: 24 Oct 2026 9:17 PM IST
Hindupur
X

Hindupur: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సబితా రెడ్డికి మద్దతుగా బలరామిరెడ్డి ప్రచారం!

హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మాజీ మున్సిపల్ చైర్మన్ బలరామిరెడ్డి 31 ఒకటో వార్డు విద్యానగర్ లో ప్రైవేట్ ,ప్రభుత్వ ఉద్యోగుల ఇంటింటి వెళ్లి ప్రచారంలో నిర్వహించారు.

మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకే వేసి వేయించి వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి సబితా రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ ప్రాంతంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఆధ్యాత్మిక చింతనతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం చేపట్టినప్పటి నుండి సబిత రెడ్డి భర్త తిమ్మారెడ్డి చేసిన సేవలను ప్రజలకు గుర్తు చేశారు.

ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ప్రచారంలో ప్రజలనుండి విశేష స్పందన లభించింది మహిళలు యువకులు పార్టీ శ్రేణులు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించి తమ ఓటు మీకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు.

C RAMANJINEYULU, HINDUPUR

C RAMANJINEYULU, HINDUPUR