Hindupur: మోదీ సుపరిపాలనకు ఆకర్షితులై హిందూపురంలో బీజేపీలోకి 10 కుటుంబాలు
Hindupur: హిందూపురం బోయపేటలో బీజేపీలోకి 10 కుటుంబాల చేరిక. నరేంద్ర మోదీ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీ కండువా కప్పుకున్నట్లు వెల్లడి.
Hindupur: మోదీ సుపరిపాలనకు ఆకర్షితులై హిందూపురంలో బీజేపీలోకి 10 కుటుంబాలు
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని స్థానిక 32వ వార్డు బోయపేటలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి రమ్య ఆధ్వర్యంలో 10 కుటుంబాలు భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వీకరించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సుపరిపాలన, పేద ప్రజల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఆయా కుటుంబాలు బీజేపీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా హిందూపురం అసెంబ్లీ కన్వీనర్ ఆదర్శ కుమార్ నూతనంగా పార్టీలో చేరిన కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పి, సాదరంగా ఆహ్వానించారు. దేశ అభివృద్ధి కోసం మోదీ గారు చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.




