Kadiri: కదిరి రూరల్ ZPTC: నాగూరి వినీత్ రెడ్డి ప్రచార జోరు
Kadiri: కదిరి రూరల్ మండలం జెడ్పీటీసీ కూటమి అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డికి మద్దతుగా ఆయన తండ్రి శ్రీనివాస్ రెడ్డి అల్లీపూర్ తండాలో ముమ్మర ప్రచారం నిర్వహించారు.
Kadiri: కదిరి రూరల్ ZPTC: నాగూరి వినీత్ రెడ్డి ప్రచార జోరు
సత్యసాయి జిల్లా: కదిరి రూరల్ మండలం ZPTC కూటమి అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. కదిరి రూరల్ మండలం అల్లీపూర్ తండాలో అభ్యర్థి తండ్రి నాగూరి శ్రీనివాస్ రెడ్డి తన కుమారుడు వినీత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అల్లీపూర్ తండాలో శ్రీనివాస్ రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలుతో ముంచెత్తారు. అడుగడుగునా అత్మీయత కనబరుస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగింది.




