Tadipatri: తాడిపత్రి మున్సిపల్ నామినేషన్ల పర్వం ప్రారంభం.. భారీ బందోబస్తు!
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ నామినేషన్ల వేళ భారీ పోలీసు భద్రత. 2 అడిషనల్ ఎస్పీలు, 17 మంది సీఐలు, వజ్ర వాహనాలతో అడిషనల్ ఎస్పీ అశ్విన్ మణిదీప్ పహారా.
Tadipatri: తాడిపత్రి మున్సిపల్ నామినేషన్ల పర్వం ప్రారంభం.. భారీ బందోబస్తు!
Tadipatri: రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల కేంద్రం అయిన మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అడిషనల్ ఎస్పీ అశ్విన్ మణదీప్ ఆధ్వర్యంలో తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్ పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. భద్రతలో భాగంగా వజ్ర వాహనాలను సైతం ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించేందుకు అడిషనల్ ఎస్పీ అశ్విన్ మణిదీప్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. దాదాపు 2 అడిషనల్ ఎస్పీలు, 17 మంది సీఐలు 30 మంది ఎస్సైలు 200 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బందోబస్తు చేపట్టామన్నారు.




