Guntakal: గుంతకల్లులో విషాదం: శిలాఫలకం కూలి వ్యక్తి దుర్మరణం

Guntakal: గుంతకల్లు అజంతా సర్కిల్‌లో ఐచర్ వాహనం ఢీకొని మున్సిపల్ శిలాఫలకం కూలడంతో రోడ్డు దాటుతున్న నగేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 6 Oct 2026 8:34 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లులో విషాదం: శిలాఫలకం కూలి వ్యక్తి దుర్మరణం

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాత గుంతకల్లు ప్రాంతంలో హెవీ వాటర్ పైప్‌లైన్ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలను పట్టణంలోని మెయిన్‌ రోడ్డు మీదుగా మళ్లించారు.

ఈ క్రమంలో అజంతా సర్కిల్ వద్దకు వచ్చిన ఓ ఐచర్ వాహనం మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఢీకొట్టింది. వాహనం ఢీకొనడంతో శిలాఫలకం కూలిపోయి, అదే సమయంలో రోడ్డు దాటుతున్న నగేష్ అనే వ్యక్తిపై పడింది. ఈ ఘటనలో నగేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న గుంతకల్లు టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL