Guntakal: గుంతకల్లు సర్కారు దవాఖాన సమస్యలు తీర్చాలి: సీపీఎం డిమాండ్
Guntakal: గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, మందుల కొరతను పరిష్కరించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సీపీఎం ఆధ్వర్యంలో డీసీహెచ్‌ఎస్‌కు వినతిపత్రం అందజేశారు.
Guntakal: గుంతకల్లు సర్కారు దవాఖాన సమస్యలు తీర్చాలి: సీపీఎం డిమాండ్
గుంతకల్లు: గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డీసీహెచ్‌ఎస్ అధికారి డి.సి.హెచ్.ఎస్. వెంకట్రావు కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిశీలించి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, మందులు, వైద్య పరికరాలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రే ప్రధాన ఆధారమని, అందువల్ల నాణ్యమైన వైద్యం, అవసరమైన పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన డీసీహెచ్‌ఎస్ వెంకట్రావు గారు ఆసుపత్రిలోని సమస్యలను పరిశీలించి, సాధ్యమైన మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




