Gooty: స్వచ్ఛ రథానికి వ్యర్థాలు ఇస్తే ఆకర్షణీయ బహుమతులు!

Gooty: గుత్తి, పామిడి మండలాల్లో స్వచ్ఛ రథం ప్రత్యేక కార్యక్రమం: వ్యర్థాలు అందజేస్తే ఆకర్షణీయ బహుమతులు, పరిశుభ్ర గ్రామాలే లక్ష్యమని తెలిపిన ఎంపీడీవో ప్రభాకర్.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 24 Sept 2026 6:33 PM IST
Gooty
X

Gooty: స్వచ్ఛ రథానికి వ్యర్థాలు ఇస్తే ఆకర్షణీయ బహుమతులు!

గుత్తి: దసరా పండుగ సందర్భంగా స్వచ్ఛ రథం కార్యక్రమంలో భాగంగా గుత్తి, పామిడి మండలాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రభాకర్ తెలిపారు. రేపటి నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు.

గ్రామపంచాయతీల పరిధిలో స్వచ్ఛ రథం గ్రామాలకు వచ్చిన సమయంలో ప్రజలు తమ ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, పాత పేపర్లు, ఇనుప వస్తువులు తదితర పునర్వినియోగ వ్యర్థాలను అందజేయవచ్చన్నారు. 10 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను స్వచ్ఛ రథానికి అందజేసిన వారిలో లక్కీ డ్రా నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.

పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎంపీడీవో తెలిపారు. గుత్తి, పామిడి మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లలోని వ్యర్థాలను స్వచ్ఛ రథానికి అందజేసి పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపడటంతో పాటు వ్యర్థాల పునర్వినియోగానికి ప్రోత్సాహం లభిస్తుందని ఎంపీడీవో ప్రభాకర్ పేర్కొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL