Tadipatri: టీడీపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ అర్ధరాత్రి వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా!
Tadipatri: ఎల్లనూరులో టీడీపీ వర్గీయులపై దాడికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి రూరల్ పీఎస్ ఎదుట అర్ధరాత్రి వరకు మంచం వేసి నిరసన తెలిపారు.
Tadipatri: టీడీపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ అర్ధరాత్రి వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా!
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి, కొడవండ్లపల్లి గ్రామాల్లో నలుగురు టీడీపీ వర్గీయులపై దాడి జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనకు నిరసనగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట మంచం వేసుకుని బైఠాయించారు. అర్ధరాత్రి వరకు తన నిరసన దీక్షను కొనసాగించారు. పోలీసులు అరాచకాలను అరికట్టాలని, లేనిపక్షంలో కార్యకర్తలు తన మాట వినే పరిస్థితి కూడా ఉండదని వ్యాఖ్యానించారు.




