Gooty: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి - చిన్నారుల రోదన
Gooty: పిల్లలను పాఠశాల నుంచి తీసుకురావడానికి వెళ్తున్న తండ్రిని టెంపో వ్యాన్ ఢీకొనడంతో మృతి. గుత్తి పట్టణంలో తీవ్ర విషాదం.
Gooty: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి - చిన్నారుల రోదన
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులో గురువారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహర్షి దయానంద గురుకులానికి చెందిన టెంపో వ్యాన్ స్కూటీని ఢీకొట్టడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న గుత్తి పట్టణంలోని బైస్త వీధికి చెందిన శ్రీరాములు (38) అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల కథనం మేరకు, శ్రీరాములు తన పిల్లలను పాఠశాల నుంచి తీసుకురావడానికి వెళ్తుండగా గుత్తి శివారులోని కోళ్ల ఫారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. టెంపో వ్యాన్ ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పిల్లలను తీసుకురావడానికి వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటన గుత్తి పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది.




