Guntakal: హస్సేన్ కలెక్షన్స్ దుకాణాన్ని ప్రారంభించిన జితేంద్ర గౌడ్, చైర్మన్ యశోద

Guntakal: గుంతకల్లు పట్టణంలోని ఎస్.ఎల్.వి. థియేటర్ కాంప్లెక్స్‌లో హస్సేన్ కలెక్షన్స్ దుస్తుల దుకాణాన్ని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, చైర్మన్ యశోద ప్రారంభించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 8 Nov 2026 3:25 PM IST
Guntakal
X

Guntakal: హస్సేన్ కలెక్షన్స్ దుకాణాన్ని ప్రారంభించిన జితేంద్ర గౌడ్, చైర్మన్ యశోద

గుంతకల్లు పట్టణం: గుంతకల్లు పట్టణంలోని ఎస్.ఎల్.వి. థియేటర్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హస్సేన్ కలెక్షన్స్ దుస్తుల దుకాణాన్ని గుంతకల్లు మాజీ శాసనసభ్యులు రామగౌని జితేంద్ర గౌడ్, మున్సిపల్ చైర్మన్ యశోద ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ దుకాణంలో తొలి కొనుగోలు చేసి బోణీ చేశారు. ఈ సందర్భంగా దుకాణ యాజమాన్యం, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ప్రారంభించిన హస్సేన్ కలెక్షన్స్ వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యువనేత పవన్ గౌడ్, టీడీపీ నాయకులు, పలువురు ముస్లిం సోదరులు, దుకాణ యాజమాన్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL