Anantapur: అనంతపురం 30వ డివిజన్ 3వ బూత్‌లో రేపు రీపోలింగ్: ఎస్పీ!
Anantapur: అనంతపురం 30వ డివిజన్‌లోని 3వ పోలింగ్ బూత్‌లో మంగళవారం రీపోలింగ్. బ్యాలెట్ బాక్స్ ఘటనపై ఎస్పీ జగదీష్ స్పందన, పూర్తి భద్రత మధ్య రీపోలింగ్ ఏర్పాట్లు.
Anantapur: అనంతపురం 30వ డివిజన్ 3వ బూత్‌లో రేపు రీపోలింగ్: ఎస్పీ!
Anantapur: నగరంలోని 30వ డివిజన్, 3వ పోలింగ్ బూత్‌లో మధ్యాహ్నం కొంతమంది వ్యక్తులు అక్రమంగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి, అధికారులను బయటకు పంపి బ్యాలెట్ బాక్సులో ఓట్లు వేసేందుకు ప్రయత్నించినట్లు ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. ఈ ఘటనపై పోలింగ్ అధికారి డైరీతో పాటు కలెక్టర్ నివేదికను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ ఒక్క పోలింగ్ బూత్‌లో మాత్రమే రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించిందన్నారు.
ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.రీపోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. 30వ డివిజన్, 3వ పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్లందరూ ఎలాంటి సందేహాలు లేకుండా 02-11-2026 వ తేదీన పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.




