Anantapur: అనంతపురంలో దారుణం బంగారు కమ్మల కోసం వృద్ధురాలి హత్య!
Anantapur: అనంతపురం కొవ్వూరు నగర్‌లో బంగారు కమ్మల కోసం 70 ఏళ్ల వృద్ధురాలు చిన్న నాగమ్మను దుండగులు రొకలిబండతో హత్య చేసి పరారయ్యారు.
Anantapur: అనంతపురంలో దారుణం బంగారు కమ్మల కోసం వృద్ధురాలి హత్య!
Anantapur: కొవ్వూరు నగర్‌లో బంగారు కమ్మల కోసం ఓ వృద్ధురాలిని దుండగులు దారుణంగా హత్య చేశారు.కొవ్వూరు నగర్‌లో తన మనవడితో కలిసి నివాసముంటున్న 70 ఏళ్ల హరిజన చిన్న నాగమ్మపై గుర్తుతెలియని దుండగులు రొకలిబండతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను దుండగులు అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న అనంతపురం డీఎస్పీ కరుణాకర్ రావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో బంగారు చెవి కమ్మల కోసమే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోందని డీఎస్పీ తెలిపారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న అనంతపురం ప్రజలను ఈ ఘటన మరింత భయాందోళనకు గురిచేస్తోంది.




