Anantapur: అనంతపురం నగరంలో చెత్త సేకరణకు ఇక ఈ-ఆటోలు!

Anantapur: అనంతపురం నగరంలో చెత్త సేకరణ కోసం ఈ-ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 19 Sept 2026 2:50 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం నగరంలో చెత్త సేకరణకు ఇక ఈ-ఆటోలు!

Anantapur: అనంతపురం నగరంలో మారుమూల ప్రాంతాల్లోని ఇళ్ల వరకు చెత్త సేకరణ వాహనాలు చేరనున్నాయని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.అనంతపురం నగరపాలక సంస్థకు ప్రభుత్వం కేటాయించిన ఈ-ఆటోలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు.నగరపాలక సంస్థకు మొత్తం 62 ఈ-వాహనాలను ప్రభుత్వం కేటాయించగా తొలి విడతగా 15 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనతో కాలుష్య రహిత చెత్త సేకరణ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. చిన్న చిన్న సందుల్లోకి సైతం ఈ-వాహనాలు వెళ్లి చెత్తను సేకరించే అవకాశం ఉందన్నారు. ప్రజలు సహకరించి తమ చెత్తను ఈ-వాహనాలకు అందజేయాలని కోరారు.గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం భారీగా చెత్తను పేరుకుపోయేలా చేసిందని ఎమ్మెల్యే దగ్గుపాటి విమర్శించారు.

అనంతపురం డంపింగ్ యార్డులో పేరుకుపోయిన మూడు లక్షల టన్నుల చెత్తలో ఇప్పటికే రెండు లక్షల టన్నులను తొలగించామని.. మిగిలిన చెత్తను కూడా త్వరలోనే పూర్తిగా తొలగిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి చెప్పారు.అదే ప్రాంతంలో సుమారు 15 కోట్ల రూపాయలతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌తో పాటు పార్కును ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

మరోవైపు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశంలో వినూత్న కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభం కావడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజన్‌కు నిదర్శనమన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM