Dharmavaram: ధర్మవరంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు.
Dharmavaram: ధర్మవరంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి!
Dharmavaram: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పెద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు టీడీపీ నాయకులు భారీగా చేరుకొని గాంధీజీ ఆశయాలు కొనసాగిస్తాం అంటూ నినాదాలు చేశారు.హింసతో కాకుండా అహింసతో సైతం ఏదైనా సాధించవచ్చునని నిరూపించిన గొప్ప వ్యక్తి మహాత్ముడు అని పట్టణ టీడీపీ అధ్యక్షుడు పరిసే సుధాకర్ అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి వార్డ్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.




