Dharmavaram: 8వ వార్డులో తాగునీటి సమస్యకు మంత్రి సత్యకుమార్ పరిష్కారం

Dharmavaram: ధర్మవరం 8వ వార్డులో తాగునీటి సమస్యకు మంత్రి సత్యకుమార్ యాదవ్ తక్షణ పరిష్కారం. నూతన బోరు బావి ఏర్పాటుతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 29 Sept 2026 6:13 PM IST
Dharmavaram
X

Dharmavaram: 8వ వార్డులో తాగునీటి సమస్యకు మంత్రి సత్యకుమార్ పరిష్కారం

ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం 8వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పరిష్కారం చూపారు.

కొద్దిరోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న 8వ వార్డు ప్రజలు సమస్యను మంత్రి సత్య కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.

నీటి సమస్యపై మంత్రి తక్షణమే స్పందించి అవార్డు బీజేపీ ఇన్చార్జి ఐన జూటూరు వెంకటేష్ కు చెప్పి సమస్య పరిష్కరించాలని సూచించారు.

మంత్రి సూచనల మేరకు జూటూరు వెంకటేష్ నూతన బోరు ఏర్పాటుకు పనులు ప్రారంభించగా మంత్రి కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు బీజేపీ నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు.

కేవలం 100 అడుగుల లోతులోనే 3 ఇంచుల మంచినీరు పడడంతో వార్డు ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు. అడిగిన వెంటనే నీటి సమస్య పరిష్కరించినందుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ కు వార్డు ఇన్చార్జి వెంకటేష్ కు తమ కృతజ్ఞతలు తెలిపారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM