Tadipatri: మున్సిపల్ పర్యటనలో రేష్మ పర్వీన్ అవగాహన!
Tadipatri: తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో 'డ్రై డే' సందర్భంగా 'దోమలపై దండయాత్ర' అవగాహన కార్యక్రమం. ప్రజాప్రతినిధి రేష్మ పర్వీన్, మున్సిపల్ కమిషనర్ ఇంటింటి పర్యటన.
Tadipatri: మున్సిపల్ పర్యటనలో రేష్మ పర్వీన్ అవగాహన!
Tadipatri: తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ప్రజారోగ్య పరిరక్షణ, దోమల నివారణ మరియు పరిశుభ్రమైన పట్టణ నిర్మాణమే లక్ష్యంగా శుక్రవారం డ్రై డే కార్యక్రమంలో భాగంగా దోమలపై దండయాత్ర సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు ప్రజాప్రతినిధులు రేష్మ పర్వీన్ పాల్గొని విజయనగర్ కాలనీలోని బాయ్స్ హైస్కూల్, విజయనగర్ కాలనీ మరియు సంజీవనగర్ ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం, దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మున్సిపాలిటీ ద్వారా అందించే తాగునీటి సరఫరా తదితర అంశాలపై అవగాహన కల్పించారు.




