Anantapur: అనంతపురంను కరువు జిల్లాగా ప్రకటించాలి: ధర్నా

Anantapur: తీవ్ర వర్షాభావంతో నష్టపోయిన అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం, రైతు సంఘాలు భారీ ధర్నా చేపట్టాయి.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 12 Oct 2026 2:50 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంను కరువు జిల్లాగా ప్రకటించాలి: ధర్నా

అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.నల్లజెండాలు, ప్లకార్డులతో రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు.

జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాలు లేక రైతులు విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో పాటు, పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అనంతపురం జిల్లాను అధికారికంగా కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.కేవలం కరువు జిల్లాగా ప్రకటించడమే కాకుండా..రైతాంగాన్ని ఆదుకునేందుకు, జిల్లా అభివృద్ధికి రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ప్రకటించాలని కోరారు.

రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందజేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM