Pamidi: పామిడి సీహెచ్‌సీలో డీసీహెచ్‌ఎస్ ఆకస్మిక తనిఖీ

Pamidi: అనంతపురం జిల్లా పామిడి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని డీసీహెచ్‌ఎస్ వెంకటరావు ఆకస్మికంగా తనిఖీ చేసి, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 24 Sept 2026 7:56 PM IST
Pamidi
X

Pamidi: పామిడి సీహెచ్‌సీలో డీసీహెచ్‌ఎస్ ఆకస్మిక తనిఖీ

పామిడి: అనంతపురం జిల్లా డీసీహెచ్‌ఎస్ వైద్యాధికారి వెంకటరావు గురువారం పామిడి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి రికార్డులు, హాజరు పట్టికలు, వైద్య సేవల నిర్వహణ తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన పరిశుభ్రత, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

వైద్యాధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వెంకటరావు హెచ్చరించారు. సమయపాలన పాటిస్తూ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

ఆస్పత్రి సిబ్బందిపై ఫిర్యాదులు వచ్చిన పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని కోరారు.

ఈ తనిఖీల్లో ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL