Anantapur: అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు !

Anantapur: అనంతపురం జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 11 కౌంటింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 7 Nov 2026 9:14 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు !

Anantapur: అనంతపురం జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.శనివారం ఉదయం 8 గంటలకు జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 11 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా రిటర్నింగ్ అధికారులు, సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు వేసిన సీళ్లను నిబంధనల ప్రకారం తొలగించారు.

అనంతరం స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించారు.అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.అనంతరం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM