Tadipatri: ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజల్లోకి విజయ్ కుమార్
Tadipatri: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశాలతో కౌన్సిలర్ విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ముందే జూటూరు కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
Tadipatri: ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజల్లోకి విజయ్ కుమార్
Tadipatri: ప్రమాణ స్వీకారం కాకముందే ప్రజల్లోకి విజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని పారిశుద్ధ్య పనులు. MLA జె.సి.అష్మిత్ రెడ్డి మాజీ MLA జె.సి.ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు... తాడిపత్రి పట్టణంలోని జూటూరు కాలనీలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కౌన్సిలర్ విజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
గత కొన్ని రోజులుగా డ్రైనేజ్ ఛాంబర్లకు మూతలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి, ఈరోజు మున్సిపాలిటీ వారిచే ఐదు కొత్త మూతలను తెప్పించి డ్రైనేజ్ ఛాంబర్లపై ఏర్పాటు చేయించడం జరిగింది.
అదేవిధంగా, కాలనీలో కుళాయి నీటికి దుర్వాసన వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. రేపు సమస్య ఉన్న ప్రాంతంలో గుంత తవ్వి, సమస్యకు గల కారణాన్ని గుర్తించి శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకొనున్నారు.




