Puttaparthi: ఎస్సీ, ఎస్టీ బాధితులకు త్వరితగతిన పరిహారం: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బాధితులకు త్వరితగతిన న్యాయం, ప్రభుత్వ పరిహారం అందించాలని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 24 Sept 2026 7:24 PM IST
Puttaparthi
X

Puttaparthi: ఎస్సీ, ఎస్టీ బాధితులకు త్వరితగతిన పరిహారం: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

పుట్టపర్తి: జిల్లాలో SC, ST వర్గాలపై ఎటువంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఒకవేళ దాడులు జరిగితే బాధ్యులపై కేసులు నమోదు చేసి బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాన్ని వేగంగా అందించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు.

కలెక్టరేట్ మిని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, మాన్యువల్ స్కావెంజర్స్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్, ఎస్పీ సతీష్ కుమార్, డిఆర్ఓ కొండయ్య , జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, ఆర్డీఓలు, ఎస్‌డిపిఓలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...అక్టోబర్ 08వ తేదీ నాడు రెవెన్యూ భవన్ నందు SC, STల సమస్యల పరిష్కారానికై ప్రత్యేకంగా "స్పెషల్ గ్రీవెన్స్ డే" నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి నెల చివరి తేదీన రెవెన్యూ, పోలీస్, సాంఘిక సంక్షేమ శాఖ, మండల స్థాయి అధికారుల సమన్వయంతో "సివిల్ రైట్స్ డే" ను ఖచ్చితంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI