Kadiri: కదిరిలో వీఆర్ఏల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ సమ్మెకు సీఐటీయూ జిల్లా నాయకత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

P.RAHAMTULLA, KADIRI
Published on: 29 Sept 2026 9:34 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో వీఆర్ఏల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు

కదిరి: సత్యసాయి జిల్లా కదిరి తహశీల్దారు కార్యాలయం వద్ద విఆర్ఎ లు తమ సమస్యలను పరిష్కరించాలని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వానికి సేవలందిస్తున్న వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం తగదన్నారు. విఆర్‌ఏ లకు పేస్కేల్ అమలు చేయడం, అర్హత ఉన్న వారికి ఉద్యోగోన్నతులు కల్పించడం, కారుణ్య నియామకాలు చేపట్టడం, ఉద్యోగ భద్రత కల్పించడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.

ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి జి.ఏల్ నరసింహులు గారికి, కదిరి మండల విఆర్ఓల సంఘం అధ్యక్షులు జనార్దన గారికి మరియు సిఐటియు నాయకులకు, రైతులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో విఆర్ఎ సంఘం మండల అధ్యక్షులు మహేష్ మరియు మండలంలోని అన్నీ గ్రామాల విఆర్ఏలు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI