Chennekothapalli: గాంధీ జయంతి నాడు యథేచ్ఛగా మద్యం విక్రయాలు: గ్రామస్తుల ఆగ్రహం
Chennekothapalli: గాంధీ జయంతి ‘డ్రై డే’ నిబంధనలను బేఖాతరు చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో మద్యం బాటిల్‌పై అదనంగా రూ.40 వసూలు చేస్తూ యథేచ్ఛగా విక్రయాలు సాగించారు.
Chennekothapalli: గాంధీ జయంతి నాడు యథేచ్ఛగా మద్యం విక్రయాలు: గ్రామస్తుల ఆగ్రహం
చెన్నేకొత్తపల్లి: జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 02 వ తేదీలలో లైసెన్స్ కలిగియున్న మద్యం దుకాణాలు తప్పనిసరిగా డ్రై, డే గా పాటించాలని ఆదేశాలు వున్నాయి. డ్రై డే రోజు ఎక్కడా కూడా మద్యం విక్రయాలు జరగకూడదు.
అయితే శ్రీ సత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎస్. ఎస్ వైన్స్ లైసెన్స్ దుకాన సమీపాన వున్న ఒక దుకాణం వద్ద అనధికారికంగా గాంధీ జయంతి రోజైన శుక్రవారం అనధికారికంగా, మద్యం విక్రయాలు జరిగాయి. వీటి విషయంలో నిత్యం దుకాణంలో మద్యం విక్రయించే వారు అనధికారికంగా వేరేవారితో మద్యం విక్రయించేలా ఏర్పాట్లు చేసుకొన్నారని చెన్నేకొత్తపల్లి గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ చెయ్యాల్సిన సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నలలో ఈ అనధికార మద్యం విక్రయాలు జరుగుతున్నాయా? అంటూ చెన్నేకొత్తపల్లి ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకించి మద్యం ధరలను సహితం ఇష్టాను సారంగా ధరలు పెంచేసి,సొమ్ము చేసుకున్నారు.ఉదాహరణకు ఎం.హెచ్ 180 ఎం.ఎల్ సామర్థ్యం కలిగిన బాటిల్ ధర రూ, 210రూపాయలు అయితే వీటికి అదనంగా రూ, 40 రూపాయలు తీసుకొని మద్యం ప్రియులను దోచేశారు.
ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి కంటికి కనిపిస్తోంది. మండల కేంద్రమైన చెన్నేకొత్తపల్లి లో రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలకు సంబంధించి, ఎక్సైజ్ శాఖ కార్యాలయం వున్నది.
ఈ కార్యాలయంలో ఈ శాఖకు సంబంధించిన అధికారులు విధులు నిర్వహించడంలో అలసత్వం వహిస్తున్నారని చెన్నేకొత్తపల్లి గ్రామ ప్రజలు బాహాటంగా ఆరోపిస్తున్నారు




