Rayadurgam: చట్టాలపై అవగాహన కల్పించాలి..రాయదుర్గం సీఐ దేవానంద్!

Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ నిర్వహణ మరియు చట్టాలపై అవగాహన సదస్సు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 8 Oct 2026 11:54 AM IST
Rayadurgam
X

Rayadurgam: చట్టాలపై అవగాహన కల్పించాలి..రాయదుర్గం సీఐ దేవానంద్!

Rayadurgam: రాయదుర్గంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ నిర్వహణ, సేవలపై న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, సభ్యులకు అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ.

రాయదుర్గం జడ్జి ఎం. రమ్య గారి ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో న్యాయవాదులు వసుంధర, రవిచంద్ర, వన్నూరు స్వామి, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ సభ్యులు డి. రామాంజనేయులు, హెడ్మాస్టర్ సత్యనారాయణతో, సీనియర్ విలేకరి ఖాజా హుస్సేన్ పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, గృహహింస, బాల్య వివాహాలు వంటి అంశాల్లో బాధితులకు ఎలా సహాయం అందించాలనే విషయాలపై చర్చించారు.

అదేవిధంగా ఐసీడీఎస్‌ శాఖ సూపర్‌వైజర్లు, సిబ్బంది మరియు ఇతర సభ్యులతో కలిసి రాయదుర్గం మండలంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాయదుర్గం అర్బన్ సీఐ దేవానంద్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, గృహహింస వంటి ఘటనలు తమ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఐసీడీఎస్ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.

అలాగే గ్రామాల్లో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 100కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారని సీఐ దేవానంద్ స్పష్టం చేశారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM