Dharmavaram: అంగన్వాడీల సేవలు నిస్వార్థం.. బీజేపీ ఇన్‌చార్జ్ కే హరీష్ బాబు!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 'అంగన్ కా ఉత్సవ్' కార్యక్రమం. అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సేవలను అభినందించిన బీజేపీ ఇన్‌చార్జ్ హరీష్ బాబు.

NAGENDRA, DHARMAVARAM
Published on: 6 Oct 2026 11:08 AM IST
Dharmavaram
X

Dharmavaram: అంగన్వాడీల సేవలు నిస్వార్థం.. బీజేపీ ఇన్‌చార్జ్ కే హరీష్ బాబు!

Dharmavaram: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్. Y సూచనలు మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 13వ వార్డు లోనికోటలోని మునిసిపల్ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన “అంగన్ కా ఉత్సవ్” కార్యక్రమంలో బీజేపీ ఇన్‌చార్జ్ హరీష్ బాబు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జగ్గా నాగరత్నమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశా కార్యకర్తలను ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు.

దేశవ్యాప్తంగా 14 లక్షల అంగన్వాడీ కేంద్రాల ద్వారా సుమారు 9 కోట్ల మంది లబ్ధిదారులకు సేవలు అందుతున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషణ, సమగ్ర అభివృద్ధితో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

అదేవిధంగా దేశవ్యాప్తంగా 1.5 లక్షల అంగన్వాడీ కేంద్రాలను ఆధునిక సదుపాయాలతో “సక్షం అంగన్వాడీ కేంద్రాలు”గా అభివృద్ధి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, చిన్నారుల సమగ్ర అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సేవలను గుర్తించి, వారికి సమాజంలో మరింత గౌరవం కల్పించడమే “అంగన్ కా ఉత్సవ్” కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని జగ్గా నాగరత్నమ్మ తెలిపారు.

చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, సమాజ ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న ప్రతి అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు మంత్రి సత్య కుమార్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM