Anantapur: అనంతపురంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీ చేరికలు!

Anantapur: అనంతపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ కో-ఆప్షన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి సహా 250 కుటుంబాలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరాయి.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 16 Oct 2026 7:32 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీ చేరికలు!

అనంతపూర్: అనంతపురం నగరంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. వైసీపీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు లక్ష్మీరెడ్డితో పాటు 250 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.అనంతపురంలోని అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి తిరిగి టీడీపీలో చేరినట్లు తెలిపారు.గతంలో వైసీపీ నాయకులు కొన్ని సమస్యలు సృష్టించడం వల్ల పార్టీని వీడాల్సి వచ్చిందని గుర్తుచేశారు.

తెలుగుదేశం పార్టీ ద్వారా మరోసారి ప్రజాసేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, పార్టీకి విధేయుడిగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి వైసీపీ నాయకులు సైతం టీడీపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.

గత వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.ఇలాంటి దాడులకు కూటమి నాయకులు, కార్యకర్తలు భయపడబోరని స్పష్టం చేశారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM