Anantapur: అయ్యప్ప స్వామి మండల పూజలలో పాల్గొన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే!
Anantapur: అనంతపురం చెరువు కట్టపై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రారంభమైన మండల పూజా మహోత్సవాల మొదటి రోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.
Anantapur: అయ్యప్ప స్వామి మండల పూజలలో పాల్గొన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే!
అనంతపురం: అనంతపురం చెరువు కట్టపై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయ. మండల పూజ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పూజా కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ నెల 17వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజూ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా మండల పూజలు, ఉత్సవ పూజలు నిర్వహించనున్నారు. అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రతిరోజూ అన్న వితరణ (అన్నదాన) కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కావున అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజల్లో భాగస్వాములై, అన్నప్రసాదాన్ని స్వీకరించి అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.




