Anantapur: ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా తీర్పు కూటమి వైపే: దగ్గుపాటి!
Anantapur: ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజల తీర్పు ఎప్పుడూ కూటమి వైపే ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో 95 శాతానికి పైగా స్థానాలు గెలిచామన్నారు.
Anantapur: ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా తీర్పు కూటమి వైపే: దగ్గుపాటి!
అనంతపురం: ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజల తీర్పు ఎప్పుడూ కూటమి వైపే ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ రాజేష్, జనసేన నగరాధ్యక్షుడు బాబురావులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 95 శాతానికి పైగా స్థానిక సంస్థల్లో కూటమి వన్ సైడ్ విక్టరీ కొట్టిందన్నారు. జెడ్పీ ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే అనంతపురంలో వైసీపీ మేయర్ అభ్యర్థి గెలిచారని.. గత ప్రభుత్వంలా మేము అక్రమాలకు పాల్పడి ఉంటే మేయర్ పీఠం కూడా మాకే దక్కేదని తెలిపారు.
నగరంలో 41 డివిజన్లు, రూరల్లో 9 ఎంపీటీసీ స్థానాల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, మేయర్ ఎన్నికలో జరిగిన చిన్న తప్పిదాలను సరిదిద్దుకుని రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఉన్న చోటే గొడవలు సృష్టించి ఎన్నికలను ఆపాలని చూశారని, కానీ కూటమి ప్రభుత్వం బీసీలకు పార్టీ పరంగా 40 శాతం రిజర్వేషన్ ఇచ్చి సామాజిక న్యాయం చేసిందన్నారు.
అనంత నగర డిప్యూటీ మేయర్ పదవి అభ్యర్థిని, అలాగే కూటమిలో ఎంపీపీ పదవి బాధ్యతలను పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. నిన్న రాత్రే అధిష్టానం నుంచి జాబితా వచ్చిందని, ఆ లిస్ట్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ రాజేష్, జనసేన నగరాధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ, ప్రజాభిమానంతోనే ఊహించని స్థానాలు గెలుచుకున్నామని, ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో మూడు పార్టీలు సమన్వయంతో పనిచేసి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.




