Anantapur: అనంతపురంలో కలకలం రాయల్ నగర్‌లో టీడీపీ కార్యకర్తలపై దాడి!

Anantapur: అనంతపురం రాయల్ నగర్‌లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గం దాడికి పాల్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 13 Oct 2026 11:57 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో కలకలం రాయల్ నగర్‌లో టీడీపీ కార్యకర్తలపై దాడి!

Anantapur: అనంతపురం నగరంలోని రాయల్ నగర్‌లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోంది.స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.నారాయణపురం పంచాయతీ పరిధిలోని రాయల్ నగర్‌లో వైసీపీకి చెందిన శ్రీహరికుమార్‌తో పాటు సుమారు 20 మంది వ్యక్తులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు రక్తగాయాలైనట్లు సమాచారం.మరోవైపు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ బాధితుల కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దాడి ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చాలని, బాధ్యులుగా నిర్ధారణ అయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.మొత్తానికి.. స్థానిక ఎన్నికలకు ముందే రాయల్ నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. మరి ఈ దాడి ఆరోపణలపై పోలీసులు ఎలా స్పందిస్తారు.బాధితులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు.విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి? అనేది వేచి చూడాలి.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM