Tadipatri: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి: సీఎస్‌డీటీ!

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని మండీ వ్యాపారుల సంఘం ప్రతినిధులకు సీఎస్‌డీటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 8:15 PM IST
Tadipatri
X

Tadipatri: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి: సీఎస్‌డీటీ!

తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలో బియ్యం ధరల నియంత్రణ మరియు వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో, ఈ రోజు (12.11.2026) తాడిపత్రి మండల సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ (CSDT) ఆధ్వర్యంలో మండీ వ్యాపారుల సంఘం (Mandi Merchants Association) ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు 27.10.2026న నిర్వహించిన సమావేశంలో నిర్ణయించిన బియ్యం రకాల వారీ ధరలను వ్యాపారులకు వివరించి, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే వినియోగదారులకు బియ్యాన్ని విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరలు:

1. BPT-3291 (సోనా) – రూ.66/-

2. BPT-5204 (సాంబా) – రూ.66/-

3. KNM – రూ.66/-

4. HMT – రూ.76/-

5. RNR – రూ.76/-

6. జై శ్రీరామ్ – రూ.82/-

7. MTU సాధారణ రకాలు – రూ.47/-

ఈ సందర్భంగా CSDT మాట్లాడుతూ, ఒకే రకమైన బియ్యాన్ని కేవలం బ్రాండ్ పేర్లు మార్చి అధిక ధరలకు విక్రయించరాదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేయకూడదని సూచించారు.

అలాగే ప్రతి హోల్‌సేల్ మరియు రిటైల్ బియ్యం దుకాణంలో ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం రకాలు, వాటి ధరలకు సంబంధించిన వివరాలతో కూడిన ధరల పట్టికను వినియోగదారులకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్యాకింగ్ చేసిన ప్రతి బియ్యం సంచిపై సంబంధిత బియ్యం రకం మరియు గరిష్ఠ చిల్లర విక్రయ ధర (MRP) స్పష్టంగా ముద్రించి ఉండాలని, ముద్రించిన MRP కంటే అధిక ధరకు విక్రయించరాదని తెలిపారు.

బియ్యం కొనుగోలు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు మరియు విక్రయాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, తనిఖీల సమయంలో సంబంధిత అధికారులకు అందుబాటులో ఉంచాలని వ్యాపారులకు సూచించారు.

ప్రభుత్వ ధరల నియంత్రణ కార్యక్రమానికి వ్యాపారులందరూ సహకరించాలని, సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బియ్యాన్ని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని కోరారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా బియ్యం విక్రయాలు జరిపినట్లు, అధిక MRP ముద్రించినట్లు లేదా వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేసినట్లు తనిఖీల్లో గుర్తించినట్లయితే సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఎన్ మాధవి లత తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్