Anantapur: 'స్వచ్ఛతా హి సేవా' ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ
Anantapur: అనంతపురంలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా 'స్వచ్ఛతా హి సేవా' ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ.
Anantapur: 'స్వచ్ఛతా హి సేవా' ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ
అనంతపూర్: ప్లాస్టిక్ రహిత, పరిశుభ్రమైన నగరమే మా లక్ష్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన 'స్వచ్ఛతా హి సేవా' ర్యాలీలో ఆయన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు.
పరిశుభ్రతపై టవర్ క్లాక్ వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, వికసిత భారత్ లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
30రోజులపాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని.. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. గత ప్రభుత్వంలో కోటి 85లక్షల టన్నుల చెత్త పెట్టిపోతే దాన్ని తీసివేసి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుందన్నారు. అనంతపురం నగరంలోని డంపింగ్ యార్డ్ లో చెత్తను తీసి వేసి ఇక్కడ ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, పార్కు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రతి ఒక్కరూ నా ఇల్లు, నా వీధి, నా నగరం, నా రాష్ట్రం, నా దేశం పరిశుభ్రంగా ఉండాలనుకుంటేనే స్వచ్ఛ భారత్ సాధ్యమని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. మరోవైపు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు గ్రామస్థాయి నుంచి జరుగుతాయని.. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.




