Anantapur: అనంతపురంలో వ్యాపారులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు!

Anantapur: అనంతపురంలో దసరా పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడి వ్యాపారులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని సీఐ కరుణాకర్ హెచ్చరించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 25 Sept 2026 12:52 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో వ్యాపారులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు!

Anantapur: అనంతపురం నగరంలో హిజ్రాల వసూళ్లపై ఆర్యవైశ్య వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.షాపుల వద్దకు వచ్చి దసరా పండుగ సందర్భంగా తరచూ ఇబ్బందులకు గురిచేస్తూ, అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు.ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు వన్‌టౌన్ సీఐ కరుణాకర్‌ను కలిసి, తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

వ్యాపారులపై ఒత్తిడి తెస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.వ్యాపారుల ఫిర్యాదుపై స్పందించిన వన్‌టౌన్ సీఐ కరుణాకర్ సమస్యను సానుకూలంగా విన్నారు. ఈ విషయంపై (హిజ్రాలతో)సంబంధిత వ్యక్తులతో మాట్లాడి, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ఎవరైనా హిజ్రాలు వ్యాపారులను బెదిరించినా, బలవంతంగా డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని సీఐ స్పష్టం చేశారు. వ్యాపారులు కూడా చట్టపరమైన పరిధిలోనే వ్యవహరించాలని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఒకటో పట్టణ సిఐ కరుణాకర్ వెల్లడించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM