Anantapur: అనంతపురంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ జగదీష్!
Anantapur: అనంతపురం: మున్సిపల్ నామినేషన్ కేంద్రాలను ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు, 144 సెక్షన్ కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Anantapur: అనంతపురంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ జగదీష్!
Anantapur: అనంతపురం నగరంలో నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ పి. జగదీష్ పరిశీలించారు.మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.నామినేషన్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు.నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో అభ్యర్థిని మాత్రమే అనుమతిస్తున్నామని పోలీసులు తెలిపారు.కేంద్రాల వద్ద ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు.
జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.




