Singanamala: సోధనపల్లిలో కూటమి సర్పంచ్ అభ్యర్థి పేట గురమ్మ ఇంటింటి ప్రచారం!

Singanamala: అనంతపురం జిల్లా సింగనమల మండలం సోధనపల్లి గ్రామంలో కూటమి పార్టీల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేట గురమ్మ సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 23 Nov 2026 7:03 AM IST
Singanamala
X

Singanamala: సోధనపల్లిలో కూటమి సర్పంచ్ అభ్యర్థి పేట గురమ్మ ఇంటింటి ప్రచారం!

సింగనమల: సింగనమల మండలం సోధనపల్లి గ్రామంలో కూటమి పార్టీల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న పేట గురమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తనకు మద్దతు తెలిపి, ఓటు వేయాలని అభ్యర్థించారు.

గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తాను ఎన్నికల బరిలో నిలిచినట్లు ప్రజలకు వివరించారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మరింత అభివృద్ధి సాధించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM