Anantapur: సింగనమల మండలం పెరవల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం!

Anantapur: అనంతపురం జిల్లా సింగనమల మండలం పెరవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు పుచ్చకాయల రాధా, పది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Nov 2026 10:44 AM IST
Anantapur
X

Anantapur: సింగనమల మండలం పెరవల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం!

అనంతపురం: అనంతపురం జిల్లా సింగనమల మండల పరిధిలోని పెరవల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది.. గ్రామం నుంచి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో తెలుగుదేశం పార్టీ మద్దతు రాలిగా పుచ్చకాయల రాధా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా పుచ్చకాయల రాధా మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేసిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు తనకు అందించిన అవకాశాలను బాధ్యతగా భావించి గ్రామ అభివృద్ధికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని తెలిపారు. వార్డు మెంబర్లుగా పుచ్చకాయల రాము,జయప్రద, రామ్ కుమార్, రామలక్ష్మి, పద్మావతి,లక్ష్మి, రాజశేఖర్, రామలక్ష్మి,అరుణ, దండు రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్