Anantapur: దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైసీపీ నేతల ఆరోపణ.. పోలీసులతో వాగ్వాదం!
Anantapur: అనంతపురం జిల్లాలోని 13 మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రూరల్ మండల పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్ల ఆరోపణలతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Anantapur: దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైసీపీ నేతల ఆరోపణ.. పోలీసులతో వాగ్వాదం!
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 210 సర్పంచ్ స్థానాలకు, 1832 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అనంతపురం కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలోని 13 మండలాల్లో ఎన్నికలు తొలిదశలో నిర్వహిస్తున్నారు.
ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పెద్ద ఎత్తున భారులు తీరారు. అనంతపురం రూరల్ మండల పరిధిలో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. దొంగ ఓట్లు వేస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు రూరల్ పోలింగ్ కేంద్రం వద్ద ఆరోపించారు. పోలీసులతో వైసిపి నాయకులు హగ్వాదానికి దిగారు. సమీపంలో ఎవరు ఉండకూడదు అంటూ పోలీసులు అక్కడి నుంచి అందరిని పంపించేశారు.




