Anantapur: రాప్తాడు బాలికపై దాడి నిందితుడు హేమంత్ కుడి కాలు తొలగింపు!

Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడు బాలికపై దాడి నిందితుడు హేమంత్ కాలు తొలగింపు. పోలీసుల కాల్పుల్లో గాయపడి గ్యాంగ్రీన్ ఏర్పడటంతో సర్జరీ చేసిన జీజీహెచ్ వైద్యులు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 3 Nov 2026 11:34 AM IST
Anantapur
X

Anantapur: రాప్తాడు బాలికపై దాడి నిందితుడు హేమంత్ కుడి కాలు తొలగింపు!

Anantapur: రాప్తాడులో టెన్త్ బాలికపై రంపంతో దాడి చేసిన ఉన్మాది హేమంత్ కుడి కాలును డాక్టర్లు తొలగించారు. పోలీసుల కాల్పుల్లో అతని కాలికి బుల్లెట్ గాయాలు కాగా రక్తప్రసరణ ఆగిపోయింది. దీంతో గ్యాంగ్రీన్ ఏర్పడగా, అలాగే వదిలిస్తే మిగతా భాగాల కణజాలం దెబ్బతిని ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో అనంతపురం GGHలో అర్ధరాత్రి తర్వాత సర్జరీ చేసి మోకాలు కిందిభాగం తొలగించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM