Anantapur: కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి రఘువీరారెడ్డి ప్రచారం!

Anantapur: అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు. మేయర్ అభ్యర్థి శాలి దాదా గాంధీ తరఫున పాతూరు పరిసర ప్రాంతాల్లో రఘువీరారెడ్డి ఇంటింటి ప్రచారం.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 28 Oct 2026 10:04 PM IST
Anantapur
X

Anantapur: కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి రఘువీరారెడ్డి ప్రచారం!

అనంతపురం: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్ బలపరిచిన మేయర్ అభ్యర్థి శాలి దాదా గాంధీతో కలిసి పాతూరు పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగించారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ బలపరిచిన మేయర్ అభ్యర్థి శాలి దాదా గాంధీకి ఓటు వేసి గెలిపించాలని రఘువీరారెడ్డి ప్రజలను కోరారు. aఅదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులను సైతం గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM