Anantapur: పోలీసులపై తోపుదుర్తి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన పోలీసు సంఘం!

Anantapur: పోలీసులపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం. చట్టపరమైన చర్యలకు నిర్ణయం.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 26 Oct 2026 10:27 PM IST
Anantapur
X

Anantapur: పోలీసులపై తోపుదుర్తి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన పోలీసు సంఘం!

అనంతపూర్: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.ఈ వ్యాఖ్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్తామని సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్ స్పష్టం చేశారు.

అనంతపురంలోని పోలీసు అధికారుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ప్రజాప్రతినిధిగా ఉండి పోలీసులపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల రక్షణ కోసం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని త్రిలోక్‌నాథ్ తెలిపారు.

అలాంటి పోలీసులను ఉద్దేశించి గుడ్డలు విప్పేసి రండి అంటూ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పోలీసులు తమ విధులను నిర్వహించారని పేర్కొన్నారు.

రాజకీయ విభేదాల్లోకి పోలీసులను లాగవద్దని రాజకీయ నాయకులకు సూచించారు.ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పోలీసులపై వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలని హితవు పలికారు.తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని త్రిలోక్‌నాథ్ స్పష్టం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM